సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం

by Shyam |   ( Updated:2022-09-03 10:10:06.0  )
సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి త‌మవంతు బాధ్య‌త‌గా తెలంగాణ డాక్యుమెంట్ రైట‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ రూ.4 ల‌క్ష‌ల విరాళం అందించింది. చెక్కును పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ నేతృత్వంలో, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స‌మక్షంలో అసోసియేష‌న్ స‌భ్యులు ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌‌ను క‌లిసి అంద‌జేశారు. క‌రోనా‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు విరాళం ఇచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు తేళ్ళ శివ‌నాగేశ్వ‌ర‌రావు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోరెడ్డి ర‌వింద‌ర్ రెడ్డి, కోశాధికారి ముర‌ళీకృష్ణ‌మ‌చారి, కార్య‌వ‌ర్గ స‌భ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story