- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా డ్రెస్ నా ఇష్టం..అడగడానికి మీరెవరు?: హిందీ యాక్ట్రెస్
దిశ, వెబ్‌డెస్క్: హిందీ టెలివిజన్ యాక్ట్రెస్ డోనల్ బిష్ట్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించింది. కొద్ది రోజుల క్రితం పోస్ట్ చేసిన బికినీ పిక్స్‌పై నెగెటివ్ కామెంట్స్ రావడంతో ఘాటుగా సమాధానం ఇచ్చింది. వేసుకునే దుస్తులు మహిళ క్యారెక్టర్‌ను డిసైడ్ చేయవని..ధరించిన డ్రెస్ ఆధారంగా ఉమన్‌ను జడ్జ్ చేయకుండా, తన మనసును అర్థం చేసుకుని నిర్ణయించాలని సూచించింది.
అయినా తనకు నచ్చిన డ్రెస్ వేసుకోవడంలో ఇతరులకున్న ఇబ్బంది ఏంటి? తన డ్రెస్సింగ్ గురించి మరొకరికి అవసరం లేదు కదా అన్న డొనల్..ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ చేసినవాళ్ల మైండ్ ఎలాంటిదో ఆలోచిస్తుంటే జాలేస్తుందన్న ఆమె..మహిళలు తమకు నచ్చిన విధంగా, కంఫర్ట్‌గా ఉన్న దుస్తులు ధరించేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఇలాంటి పిచ్చి కామెంట్స్‌తో జడ్జ్ చేయొద్దు అని చెప్పింది. భూమి మీద తానొక్కదాన్నే బికినీ ధరించినట్లు కామెంట్స్ చేస్తున్నారు ఏంటో అని మండిపడింది. ఇది తన మీదే కాదు తన ఫ్యామిలీ మీద కూడా ప్రభావం చూపుతుందని.. ఇలాంటి విమర్శల వల్ల అమ్మ కూడా భయపడిపోయిందని తెలిపింది.
24 గంటలు సోషల్ మీడియాలో ఉండటం కూడా మంచిది కాదని చెప్పిన డోనల్ .. ఒక వేళ ఉన్నా సరే నెగెటివ్ కామెంట్స్ మీద కాన్సంట్రేట్ చేయకూడదని.. వాటిని త్వరగా స్క్రోల్ చేయాలని సూచించింది. తానెప్పుడూ లైఫ్‌లో బ్రైటర్ సైడ్ పై మాత్రమే దృష్టి సారిస్తానని..కానీ, ఈ విషయంలో తప్పక స్పందించాల్సి వస్తుందని తెలిపింది. తను చెప్పిన తర్వాత కూడా నెగెటివిటి కంటిన్యూ అయితే సైబర్ క్రైమ్ సెల్‌ను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించింది.