- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూఎస్ ఓపెన్ విజేత థీమ్
దిశ, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను డొమినిక్ థీమ్ గెలిచాడు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగిన హోరాహోరీ పోరులో స్వెరెవ్‌పై థీమ్ అద్భుత విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా… మొక్కవోని దీక్షతో మిగిలిన మూడు సెట్లు గెలిచి తన జీవితంలో తొలి గ్రాండ్‌స్లామ్ నెగ్గాడు. జ్వెరెవ్‌పై 2-6, 4-6, 6-4, 6-3, 7-6 తేడాతో గెలుపొందాడు. ఒక ఆస్ట్రియా టెన్నిస్ ప్లేయర్ యూఎస్ ఓపెన్ గెలవడం ఇదే తొలిసారి.
అంతేగాకుండా 90వ దశకంలో పుట్టి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన రికార్డును కూడా థీమ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకున్న థీమ్ జకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. యూఎస్ ఓపెన్ ఫేవరెట్‌గా అందరూ జకోవిచ్‌నే భావించారు. కానీ నాలుగో రౌండ్‌లో అనూహ్యంగా డిస్ క్వాలిఫై కావడంతో అందరి దృష్టి థీమ్‌పై పడింది. అందరి అంచనాలను అందుకుంటూ ఎట్టకేలకు థీమ్ యూఎస్ టైటిల్ గెలుచుకున్నాడు. తొలి రెండు సెట్లలో వెనుకబడిన ఆటగాడు యూఎస్ ఓపెన్ నెగ్గడం చరిత్రలో ఇదే తొలిసారి.
Read Also…