- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభాల్లో ముగిసిన మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బుధవారం ఆటుపోట్ల మధ్య కొనసాగిన సూచీలు గురువారం సైతం అదే ధోరణిని కొనసాగించాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలకు తోడు యూకే ప్రభుత్వం కరోనా టీకా ఫైజర్‌కు అనుమతి ఇవ్వడం, ఇతర కరోనా వ్యాక్సిన్‌లకు సంబంధించి సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటంతో స్టాక్ మార్కెట్లు లాభాలను దక్కించుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మిడ్ సెషన్ వరకు ర్యాలీ చేసిన అనంతరం చివర్లో మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 14.61 పాయింట్లు లాభపడి 44,632 వద్ద ముగియగా, నిఫ్టీ 20.15 పాయింట్ల లాభంతో 13,133 వద్ద ముగిసింది.
నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏకంగా 5 శాతానికిపైగా ర్యాలీ చేయగా, ఆటో, మెటల్, మీడియా రంగాలు పుంజుకున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఐటీ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఓఎన్‌జీసీ, ఏషియన్ పెయింట్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్, టైటాన్ షేర్లు అధిక లాభాలను దక్కించుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.91 వద్ద ఉంది.