- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోసం చేసి భూమి కాజేసిన వ్యక్తి అరెస్ట్ : సీఐ జగదీష్
దిశ,బెల్లంపల్లి : మోసం చేసి భూమిని కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సిఐ జగదీష్ పేర్కొన్నారు. అత్త పేరు మీద ఉన్న భూమిని కోడళ్ల పేరు మీదకు మార్చమని అర్థించగా కుటుంబ సభ్యునిగా తన పేరు నమోదు చేసికొని భూమిని తన పేరున మార్చుకున్న ధరావత్ రాజకుమార్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ వెల్లడించారు. గురువారం స్థానిక రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెన్నెల మండల కేంద్రానికి చెందిన ధరావత్ గోదారి ఇటీవల మరణించగా ఆమె కొడుకులైన ధరావత్ విజయ్, రవి, కిరణ్ ల అమ్మ పేరు మీద ఉన్న రెండు ఎకరాల 11 గంటల భూమిని ముగ్గురు కోడళ్లకు సమాన భాగాలుగా రిజిస్ట్రేషన్ చేయించాలని వారికి పరిచయం ఉన్న ధరావత్ రాజ్ కుమార్ ను సంప్రదించారు.
అధికారులందరూ తనకు పరిచయస్తులేనని భూ పట్టా చేయిస్తానని నమ్మించి 45 వేల రూపాయలు తీసుకుని ఫోర్జరీ సంతకాలతో వారి కుటుంబ సభ్యులుగా అఫిడవిట్లు తయారు చేయించి తహసిల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం వారి ప్రమేయం లేకుండానే తక్కువగా నమోదు చేయించాడు. మోసం చేసిన విషయం తెలుసుకొని నిలదీయగా తనకేమీ తెలియదు అంటూ బుకాయించాడు. ధరావత్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు పోలీసులు తెలిపారు.