- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆశీర్వాదాలిస్తోన్న శునకరాజం..
దిశ, వెబ్‌డెస్క్: ఆలయాల్లోకి అప్పుడప్పుడు పాములు, పక్షులు వస్తుండటం చూసే ఉంటారు. అయితే అది దేవుడి మహిమగా, వాటిని మహిమాన్వితమైన శక్తులు కలిగి ఉన్న దైవదూతలుగా భావిస్తుంటారు భక్తులు. శివ లింగంపై పాము చేరితే పాలాభిషేకాలు చేయడం.. గుళ్లోకి వచ్చిన వరాహం ప్రదక్షిణలు చేస్తే, అది విష్ణువు కూర్మావతారానికి నిదర్శనమని పూజలు చేయడం పరిపాటే. ఈ క్రమంలోనే ఓ వీధి శునకం మహారాష్ట్రలోని సిద్ధివినాయక స్వామి ఆలయంలోకి రాగా, భక్తులు దాని నుంచి ఆశీర్వాదం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
మహారాష్ట్ర, అహ్మద్ నగర్ జిల్లాలోని సిద్దివినాయక స్వామి ఆలయంలో కొద్దిరోజులుగా ఓ శునకం భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆలయం బయట మెట్లను ఆనుకుని ఉన్న బ్లాక్‌స్టోన్‌పై కూర్చొని, దర్శనం అనంతరం బయటకు వస్తున్న భక్తులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీంతో ఆ శునకాన్ని దైవ స్వరూపంగా భావిస్తున్న భక్తులు ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను అరుణ్ లిమాడియా అనే నెటిజన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ‘ఇది నిజంగా అద్భుతం.. ఇదంతా దేవుని మహిమే, జంతువులు కూడా దేవుని సంకేతాలే, దేవుడు సకల చరాచర జీవుల్లో ఉన్నాడనడానికి ఇదో నిదర్శనం’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.