- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా దేవుడు మీరేనయ్యా!
దిశ, వెబ్ డెస్క్: దానికి రంగు, వాసన ఉండదు.. రూపమున్నా అది కనిపించదు. శబ్దం చేయదు.. కానీ, గాలిలో వేగంగా ఉరుకుతది. కనిపించకున్నా అది ఎక్కడికైనా వెళ్లగలదు. ఇలా అది ఎక్కడకు వెళ్లితే అక్కడ విలయతాండవం సృష్టిస్తది. దీంతో మొత్తంగా భయాందోళన వాతావరణం ఏర్పడుతది. అదేనండి కరోనా వైరస్. ఇది ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్నది. దీంతో ఎక్కడ చూసినా ఆగమాగమైతున్నారు… ఎక్కడివారు అక్కడికే పరిమితమయ్యారు. దాని కొరకు చిక్కినోళ్లు అల్లాడుతున్నారు. అందులో కొంతమంది మృతి చెందారు. ఇలా మొత్తంగా కరోనా ప్రపంచ వ్యాప్తంగా హైరానా చేస్తోన్నది. దీంతో యావత్ ప్రపంచమే ఈ మహమ్మారితో యుద్ధం చేయాల్సి వస్తోంది. అందులో ముఖ్యంగా అగ్రభాగం డాక్టర్లదే. ఎందుకంటే కరోనాతో యుద్ధం చేస్తున్నవారిలో ముందు భాగాన నిలబడినది డాక్టర్లే. తమ శక్తికి మించి కరోనాతో పోరాడుతున్నారు. తిండితిప్పలు మాని కరోనాతో యుద్ధం చేస్తున్నారు. అందుకే వీరిని మనుషుల రూపంలో ఉన్న డాక్టర్లు అంటారు.
కరోనా వైరస్ చైనాలో మొదటగా వ్యాప్తి చెందినప్పుడు అక్కడ దీని కొరకు చిక్కి ఎంతోమంది మృతిచెందారు. అంతేకాదు చాలామంది చికిత్స పొంది కోలుకున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన వైద్యనిపుణులు, డాక్టర్లు ఈ వైరస్ పై పరిశోధన చేసి దాని పుట్టుక, వ్యాప్తి, నివారణ, కట్టడి వివరాలు తదితర వివరాలు తెలిపారు. కానీ, అప్పటికే ఆ వైరస్ ప్రపంచంలోని సుమారు 200 దేశాలకు పలు రూపాల్లో వ్యాపించి ఇప్పుడు విలయం తాండవం సృష్టిస్తోన్నది. దీంతో ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నిచేస్తున్నారు. ఆ వైరస్ సోకిన వారికి తమ ప్రాణాలను లెక్కచేయకుండా బాధితులకు వైద్యం అందిస్తున్నారు. అది గాలిలో వేగంగా వ్యాప్తి చెందే వైరస్ అని కూడా తెలిసి దానికి ఏ మాత్రం భయపడకుండా వైద్యం చేస్తున్నారు. తమకు తెలిసిన అన్ని విధాలుగా అడుగులేస్తూ దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
కుటుంబాలకు దూరంగా..
తమ కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ కరోనా సోకిన వారికి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. 24 గంటలపాటు శ్రమిస్తూ సేవలందిస్తున్నారు. నిద్రాహారాలు మాని వైద్యం చేస్తున్నారు. ఏ మాత్రం కూడా దానికి భయపడకుండా ముందుకు వచ్చి బాధితులకు సేవలందిస్తూ కరోనాతో యుద్ధం చేస్తున్నారు.
సూచనలిస్తూ..
ఇంకొంతమంది డాక్టర్లు తమకు తోచిన విధంగా వైద్య సేవలందిస్తూ కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. దానిని కట్టడి చేసేందుకు అనుకూలమైన అంశాలను సైతం వాళ్లు ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వాలకు చేరవేస్తున్నారు.
చైనాలో..
కరోనా కారణంగా చైనా మొత్తం అతలాకుతలమైంది. ఆ దేశంలో ఎక్కడ చూసిన ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఎంతోమంది దాని కోరకు చిక్కి కొట్టుమిట్టాడారు. ఈ సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు ఆ దేశ వైద్యులు కంకణం కట్టుకుని ముందడుగు వేశారు. పలు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా సోకిన వారికి వైద్యం అందించారు. వారు తగు జాగ్రత్తలు తీసుకునే సమయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా పాటించినా కూడా ఆ వైరస్ వారికి చేరే అవకాశముంది. ఒకవేళ సోకిన కూడా అతడి నుంచి ఎదుటి వ్యక్తికి సులువుగా వ్యాప్తి చెందే అవకాశముంది. ఈ నేపథ్యంలో వారంతా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా తీసుకుంటూ వైద్యం అందించారు. కొంతమందిని బ్రతికించగలిగారు. ఈ సమయంలో తమ కుటుంబాలకు సైతం కూడా దూరంగా ఉన్నారు. నిత్యం ఆసుపత్రుల్లోనే ఉంటూ బాధితులకు చికిత్స అందించారు. నిద్రాహారాలు మాని వైద్యం అందించారు. తమ పిల్లలు, కుటుంబాలను చూడాలనుకున్నా కూడా వారికి దూరంగా ఉండి చూచి వారిని వెనక్కి పంపించారు. ఈ విషయానికి సంబంధించిన కొన్ని వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అయినయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ బాధపడుతూ డాక్టర్లపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మనదేశంలో కూడా..
మన దేశంలో ప్రస్తుతం కరోనాతో యుద్ధం చేస్తున్నవారిలో డాక్టర్ల పాత్ర అమోఘం. వారు కూడా తమ శక్తి మేరకు కృషి చేస్తున్నారు. వారి కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలను కొనియాడుతూ ప్రజలు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేవిధంగా వారి సేవలను కొనియాడుతూ కేంద్ర, ప్రభుత్వాలు కొనియాడుతూ వారికి అన్ని విధాలా సాయం చేస్తున్నాయి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి రూ. 50 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ కల్పించిన విషయం తెలిసిందే. మనం కూడా వైద్యో నారాయణ హరి అంటూ వారిని ప్రశంసించాలి.
Tags: Doctors, service, office, Governaments, hospital, corona