సాయితేజ్‌కు రెండు సర్జరీలు.. డిశ్చార్జ్ అయ్యేది అప్పుడే!

by Anukaran |   ( Updated:2021-10-08 08:17:32.0  )
Sai Dharam Tej
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ దసరా తర్వాత డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని అపోలో వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో ఎడమ భుజానికి తీవ్రగాయం కావడంతో రెండుసార్లు సర్జరీ చేయాల్సి వచ్చిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని స్పష్టం చేశారు. కాగా, మెగా హీరో సాయిధరమ్ తేజ్ నెలరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు తేల్చిచెప్పారు. కన్‌స్ట్రక్షన్ జరుగుతోన్న రోడ్డుపై మట్టి ఉండటంతో అతివేగంగా వచ్చిన బైక్ స్కిడ్‌ అయ్యి కిందపడిన సంగతి తెలిసిందే.

బిగ్ బ్రేకింగ్ : అబార్షన్‌పై స్పందించిన సమంత

Advertisement

Next Story