ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు

by Shyam |
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు
X

దిశ, పటాన్ చెరు: ప్లాస్టిక్ వ్యర్ధాలు తిని ఇబ్బంది పడుతున్న ఆవుకు అమీన్‌పూర్ మండల పశువైద్యాధికారి డాక్టర్ విశ్వ చైతన్య శస్త్రచికిత్స చేసి సుమారు 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికితీశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లపై తిరిగే రెండు ఆవులను ఇరవై రోజుల క్రితం బీరంగూడలోని గోశాలకు తీసుకువచ్చారు. పొట్టలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడం వల్ల ఆవులు ఇబ్బంది పడుతూ అనారోగ్యంగా ఉన్నాయి. దీంతో మండల పశువైద్యాధికారి విశ్వ చైతన్య విషయం తెలుసుకుని శస్త్రచికిత్స చేశారు. ఆ ఆవు పొట్టలో సుమారు 80 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటకు తీశారు.

Advertisement

Next Story

Most Viewed