ఈ డాక్టర్ సూపర్..!

by Shamantha N |
ఈ డాక్టర్ సూపర్..!
X

దిశ, వెబ్ డెస్క్ : తన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి లాక్ డౌన్ కారణంగా 270 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకోలేక అవస్థలు పడుతున్న 8 ఏళ్ల రోగిని ఓ డాక్టర్ తన కారులోనే విడిచిపెట్టి ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. ఈ సంఘటన కోల్ కతాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. కోల్ కతాలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏంజెలా అనే 8 ఏళ్ల బాలిక చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకుంది. గత నెల 23న డిశ్చార్జ్ అయ్యింది. అయితే ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్నందునా బీర్‌భూమ్‌ సమీపంలో ఉన్న తన స్వగ్రామానికి చేరుకోలేక ఆమె ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఆమె వెంట తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇలా రెండురోజులు గడిచిపోయింది. వాళ్ల అవస్థలను గమనించిన ఆస్పత్రి డాక్టర్ సర్దార్ హృదయం చలించిపోయింది. వారి వివరాలు ఆరా తీశాడు. తాము పేదవాళ్లం కాడవంతో ప్రైవేట్ అంబులెన్స్ కు భారీ కిరాయిలను చెల్లించుకోలేక ఇక్కడే ఉన్నామని వారు ఆ డాక్టర్ తో చెప్పారు. దీంతో అతను వారిని తన కారులోనే తీసుకెళ్లి వదిలి వచ్చాడు. ఆ ఊరు ఆస్పత్రి నుంచి 270 కిలో మీటర్ల దూరంలో ఉంటది. ఈ విషయం తెలుసుకున్న వారందరూ డాక్టర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags: Doctor, 8-year-old patient, hospital, 270km, Kolkata

Advertisement

Next Story

Most Viewed