విధుల్లోకి డాక్టర్ వసంత్..

by Shyam |
విధుల్లోకి డాక్టర్ వసంత్..
X

గాంధీ ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా నెలకొన్నవివాదాలకు కారణమైన డాక్టర్ వసంత్ ఎట్టకేలకు సోమవారం విధుల్లో చేరాడు. తాను ఏ తప్పు చేయలేదని తనను విధుల్లోకి తీసుకోవాలని హెల్త్ డైరక్టర్‌ను వసంత్ కలిసి విన్నవించారు. దీంతో గాంధీలోని డీహెచ్ఎంవో విభాగంలో పోస్టింగ్ ఇస్తూ ఆయన ఉత్తర్వులు జారీచేశారు.ఇదిలా ఉండగా గాంధీలోని రోగులకు కరోనా వైరస్ సోకిందంటూ లీకులు వెలువడటం వెనుక డాక్టర్ వసంత్ హస్తముందంటూ సూపరిటెండెంట్ ఆయన్ను సస్పెండ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అనంతరం వసంత్ ఆస్పత్రిలో పెద్దఎత్తున్న స్కామ్స్ జరుగుతున్నాయని దాని గురించి ప్రశ్నించినందుకే తనను విధుల నుంచి తప్పించారని సూపరిటెండెంట్, పలువురు అధికారులపైన ఆరోపణలు చేశారు.కాగా, దీనిపై మంత్రి ఈటల స్పందించడం విచారణకు ఆదేశించడం అన్నివెనువెంటనే జరిగిపోయాయి.

Advertisement

Next Story