- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యుడు పేషంట్‌పై లైంగిక దాడికి యత్నం
దిశ, వెబ్‌డెస్క్: వైద్యో నారాయణో హరి అంటారు.. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. కాని ఓ వైద్యుడు వైద్య వృత్తికే కలంకం తెచ్చాడు. తన దగ్గరకు వచ్చిన పేషంట్‌పై లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యానందం అనే పారా మెడికల్ డాక్టర్ నవాబ్‌పేటలోని మారుతీనగర్‌లో క్లినిక్ నడుపుతున్నాడు. అలాగే ఆర్ఆర్ పేటలోని ఓ కంటి వైద్యశాలలో పారామెడికల్ వైద్యుడిగా కూడా పనిచేస్తున్నాడు. అక్కడ విధులు నిర్వహిస్తూనే.. స్థానికంగా సొంతంగా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఐతే మారుతీనగర్‌కు చెందిన ఓ యువతి తలనొప్పితో బాధపడుతూ సత్యానందం క్లినిక్‌కు వెళ్లింది.
సత్యానందానికి ఆమెపై కన్నుపడింది. ఓ మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి.. తల తిరుగుతాదని కొంచెంసేపు ఓపిక పడితే తగ్గిపోతుందని చెప్పాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. భయపడిపోయిన ఆ యువతి బిగ్గరగా కేకలు వేయడంతో బయట ఉన్న ఆమె సోదరుడు లోపలికి వెళ్లి వైద్యుడిని అడ్డుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. వారంతా అక్కడికి చేరుకున్నారు. సత్యానందానికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.