దానికోసమే ఆ డాక్టర్ కరోనా శవాన్ని ముద్దుపెట్టుకున్నాడు

by Sridhar Babu |
దానికోసమే ఆ డాక్టర్ కరోనా శవాన్ని ముద్దుపెట్టుకున్నాడు
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా కాటుకు ఎంతో మంది బలి అవుతున్నారు. అయితే కరోనాతో చనిపోయిన మృతదేహాలను దహన సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కరోనాతో చనిపోయిన వారిని ముట్టుకుంటే వారికి కూడా కరోనా సోకుతుందని ప్రజలు భయపడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మృతదేహాల నుంచి వైరస్ సోకదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయినా ప్రజలు కరోనా శవాల దగ్గరకు రావడానికి జంకుతున్నారు.

అయితే ప్రజలలో ఉన్న ఇలాంటి అపోహలను తొలిగించడానికి ఓ డాక్టర్ చేసిన పనిచూస్తే షాక్ అవ్వాల్సిందే. ఖమ్మంలోని అన్న ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ డా.అన్నం శ్రీనివాస్ కరోనా శవాలను ముట్టుకుంటే వైరస్ సోకుతుందనే భయాన్ని పోగొట్టడానికి ఏకంగా కరోనా శవాన్ని ముద్దాడారు. అయితే కరోనాతో చనిపోయిన మృతదేహాల నుంచి వైరస్ వ్యాపించదని చెప్పడానికే తాను మృతదేహాన్ని ముద్దు పెట్టుకున్నట్టు డాక్టర్ తెలిపాడు.

Advertisement

Next Story