- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట్ పరీక్ష కేంద్రంలో కొడుకు.. హోటల్‌లో తండ్రి ఆత్మహత్య
దిశ, కూకట్‌పల్లి: కొడుకు నీట్ పరీక్ష కోసం నగరానికి వచ్చిన డాక్టర్ హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా అజీమ్‌పురకు చెందిన డాక్టర్ (పీడియాట్రిషియన్) రామకృష్ణప్ప చంద్రశేఖర్ (50).. తన కొడుకు సోహన్ సాయి నీట్ పరీక్ష కోసం ఆదివారం ఉదయం తన భార్య అనురాధతో కలిసి నగరానికి వచ్చాడు. సోహన్‌ను నిజాంపేట్‌లోని గ్యాంగ్స్వాలి స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో వదిలిన తర్వాత భార్యను మెదక్ బస్సు ఎక్కించాడు.
అనంతరం కేపీహెచ్‌బీ కాలనీలోని సితారా హోటల్లోని ఓ రూమ్ (314)ను అద్దెకు తీసుకున్నాడు. లోపలికి వెళ్లిన చంద్రశేఖర్ ఎంతకీ బయటకు రాలేదు. దీంతో రూమ్ బాయ్ సర్వీస్ కోసం వచ్చి తలుపు కొట్టినా తెరువలేదు. వెంటనే అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం కేపీహెచ్‌బీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్‌కు చేరుకొని రెండవ తాళంతో తలుపు తెరిచి చూడగా చంద్రశేఖర్ ఫ్యాన్‌కు ఉరేసుకొని విగతాజీవిగా కనిపించాడు.
ఇదిలా ఉండగా డాక్టర్ చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఒంటిపై అండర్వేర్ తప్పా వేరే దుస్తులు లేవు. మృతదేహాన్ని కిందికి దించిన పోలీసులు హోటల్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా పోలీసులు ఇచ్చిన సమాచారంతో చంద్రశేఖర్ భార్య అనురాధ, కొడుకు సోహన్ సాయి హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ చంద్రశేఖర్ వ్యక్తిగత సమస్యలతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు సీఐ లక్ష్మీ నారాయణ వివరణ ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని.. ఆత్మహత్యకు గల కారణాలను విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు.