ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో డాక్ అదాలత్

by Shyam |
ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో డాక్ అదాలత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తపాలా సేవలకు సంబంధించి ప్రజల ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకొనేందుకు ఫిబ్రవరి 11 తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ఆబిడ్స్‌లోని డాక్ సదన్‌లో డాక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు తపాలా విభాగంలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ హెడ్ క్వార్టర్ రీజియన్, హైదరాబాద్ కార్యాలయం తెలిపింది. డాక్ సదన్ 2వ అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు వారి ఫిర్యాదులను, సమస్యలను లిఖితపూర్వకంగా పొందుపరచి తపాలా కవర్‌లో 2021 ఫిబ్రవరి 4వ తేదీ లోపు తెలియజేయవచ్చు. కవర్ పైన ‘డాక్ అదాలత్’ అనే పదాలు రాసి మన్మధరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్, ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, తెలంగాణా సర్కిల్, హైదరాబాద్-500001 చిరునామాకు పంపాలని ప్రకటనలో కోరారు.

Advertisement

Next Story