ఉద్యమకారుడు శ్రీకాంతా చారి గుర్తున్నాడా కేసీఆర్ : మాజీ ఎంపీ వీహెచ్

by Shyam |
ఉద్యమకారుడు శ్రీకాంతా చారి గుర్తున్నాడా కేసీఆర్ : మాజీ ఎంపీ వీహెచ్
X

దిశ, యాదగిరిగుట్ట : సీఎం కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీర్ల ఐలయ్య నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వీహెచ్ మాట్లాడుతూ.. సిద్దిపేట కలెక్టర్‌గా వెంకటరాం రెడ్డి రాజీనామా చేసిన 24 గంటల్లోపే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంలో సీఎం కేసీఆర్ ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడి, ప్రాణ త్యాగం చేసిన అమరుడు శ్రీకాంతా చారి తల్లికి ఇస్తే బాగుండేదని అన్నారు.

ఎమ్మెల్సీ టిక్కెట్ల కేటాయింపులో మహిళకు చోటు లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి తన నియంతృత్వ వైఖరిని మార్చుకోకపోతే తెరాస పార్టీ కాలగర్భంలో కలిసే రోజు వస్తుందన్నారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపర్చాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోళ్ల పేరుతో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నాయన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఇరు ప్రభుత్వాలకు సూచించారు. కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గం ఇన్చార్జి బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షులు కానుగు బాలరాజు, నాయకులు గుండు నర్సింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story