- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆటలకు ఆటంకాలు ఎలా వచ్చాయో తెలుసా?
దిశ, స్పోర్ట్స్: కరోనా దెబ్బకు ప్రస్తుతం క్రీడా ప్రపంచం స్తంభించిపోయింది. గ్రామ స్థాయి మొదలుకొని అంతర్జాతీయ స్థాయి వరకు ఎలాంటి ఆటల పోటీలు జరగడం లేదు. కనీసం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే పరిస్థితి లేదు. అయితే, క్రీడలు నిలిచిపోవడం లేదా రద్దు కావడం ఇదే తొలిసారి కాదు. యుద్ధాలు, దేశాల మధ్య పరోక్ష పోరు కారణంగా ముఖ్యంగా ఒలింపిక్స్ ఎక్కువసార్లు రద్దయ్యాయి. ఉగ్రవాద చర్యలతో రక్తసిక్తం కూడా అయ్యాయి. కానీ, అంటువ్యాధి భయాందోళనలతో క్రీడా పోటీలు స్తంభించిపోవడం మాత్రం ఇదే ప్రథమం.
1936, బెర్లిన్ ఒలింపిక్స్‌ను ఐర్లాండ్ బహిష్కరించింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కేవలం ఐరిష్ ఫ్రీ స్టేట్ ప్రాంతాల్లోని ఆటగాళ్లను మాత్రమే అనుమతించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 1956, మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌ను నెదర్లాండ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ బహిష్కరించాయి. హంగేరి స్వతంత్ర ఉద్యమాన్ని అప్పటి సోవియట్ రష్యా అణచివేయడానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. 1976, కెనడా ఒలింపిక్స్ నుంచి తైవాన్ జట్టును నిషేధించారు. దీనిపై విమర్శలు వెలువెత్తాయి. అప్పటి నుంచి 1984 వరకు తైవాన్ ఆటగాళ్లు ఏ క్రీడల్లోనూ పాల్గొనలేదు. చివరకు క్రీడా సంస్థ పేరును చైనీస్ తైపీగా మార్చిన తర్వాతే ఆ దేశ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916 ఒలింపిక్స్, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944 ఒలింపిక్స్‌ను రద్దు చేశారు.
ఒలింపిక్స్ చరిత్రలో 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ అత్యంత విషాదమని చెప్పుకోవచ్చు. పాలస్తీనాకు చెందిన బ్లాక్ సెప్టెంబర్ అనే ఉగ్రవాద సంస్థ 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను బందీలుగా చేసుకుంది. వీరిలో ఇద్దరిని కిడ్నాప్ చేసిన కొంతసేపటికే హత్య చేశారు. ఉగ్రవాదులతో జర్మనీ పోలీసులు ఎన్ని చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరికి మిగిలిన 9 మంది క్రీడాకారులు కూడా దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రీడలు ‘మ్యూనిచ్ నరమేథం’గా నిలిచిపోయాయి. అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో ప్రధాన స్టేడియం వద్ద బాంబు పేలి ఇద్దరు మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. 2001, సెప్టెంబర్‌లో ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత 2002లో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించడం గమనార్హం.
అంటువ్యాధి కారణంగా ఆటలు నిలిచిపోవడం మాత్రం ఇదే తొలిసారి. ఈసారి ఒక్క ఒలింపిక్స్ మాత్రమే కాకుండా ఇతర క్రీడలూ జరగడం లేదు. క్రికెట్, ఫుట్‌బాల్ లీగ్స్, టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్, బ్యాడ్మింటన్ టోర్నీలు వాయిదా పడ్డాయి. ప్రపంచంలో సినిమాల తర్వాత వినోదం అంటే చాలా మంది క్రీడలనే ఎంచుకుంటారు. రాబోయే కాలంలో ప్రపంచ దేశాల్లో పరిస్థితులు కుదుటపడాలంటే క్రీడలే దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్రీడల వల్ల ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. టూరిజం, హాస్పిటాలిటీకి వెన్నుదన్నుగా నిలిచేది క్రీడా ఈవెంట్లేనని కాబట్టి వీలైనంత త్వరగా క్రీడలను తిరిగి ప్రారంభించాలని అన్ని దేశాలు భావిస్తున్నాయి.