ఇంటిలో ఎలా ఉండాలి?

by vinod kumar |
ఇంటిలో ఎలా ఉండాలి?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటిస్తే కరోనా కట్టడి చేసే అవకాశముందన్న ముఖ్య ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం లాక్‌డాన్‌ను కొనసాగిస్తున్నాయి. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనే బయటకొస్తున్నారు. ఆ సమయంలో పలు జాగ్రత్తలు పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇంటి బయట పలు జాగ్రత్తలు పాటిస్తూ సామాజిక దూరంగా ఉంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఇంట్లో కూడా ఇదేవిధంగా జాగ్రత్తలు పాటిస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే అని చెప్పుకోవాలి. ఇంట్లోనే ఉంటేనే కరోనా బారిన పడే అవకాశంలేదు. ఒకవేళ ఆ ఇంటిలో ఎవరికైనా కరోనా సోకితే వెంటనే వారిని గుర్తుపట్టి.. వారికి సరైన విధంగా చికిత్స అందించే అవకాకశముంది. అదేవిధంగా ఆ ప్రాంతంలో కరోనా వ్యాపించికుండా కట్టడి చేసే వీలుంది. దీంతో ఈ మార్గాన్నే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచుకుని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా తమ ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకి రావడంలేదు. అయితే.. ఇదంతా అలా పక్కకు పెడితే.. ఇంట్లో ఉంటూ కరోనా బారిన పడకుండా ఉంటున్నారు. కానీ, ఇంట్లో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారా.. సామాజిక దూరం పాటిస్తున్నారా అంటే… అదేమీ లేదన్నట్టుగా అర్థమవుతోంది. కొంతమందే ప్రభుత్వం, నిపుణులు సూచించిన నిబంధనలు ఇంట్లో పాటిస్తున్నారని, చాలా వరకు ప్రజలు ఇంట్లో అవేమీ పట్టించుకోవడంలేదని సమాచారం. దీంతో కరోనా ప్రమాదం పొంచి ఉండే అవకాశం లేకపోలేదని నిపుణులుల చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరికైనా కరోనా సోకిన సోకితే వారికి 14 రోజుల తర్వాత బయటపడుతది.. అంతుకు రోజుల్లో అంతా సాధారణంగా ఉండే అవకాశముంది. అయితే ఈ లోపు ఆ వ్యక్తి ఎవ్వరిని తాకినా, అతని వద్ద ఎవరు సంచరించినా.. ఇలా అతని కారణంగా ఇతర మార్గాల్లో తన కుటుంబ సభ్యులకు, ఆ చుట్టుపక్కల వారికి, ఆ ప్రాంతంలో నివసించే వారికి కరోనా సోకే అవకాశముంది. అలా అది ప్రబలే అవకాశముంది. దీంతో కరోనాను కట్టడికి చాలా ఇబ్బంది అయ్యే అవకాశముంది. అదేవిధంగా చాలా ఇతర ప్రాంతాల నుంచి తమ కుటుంబ సభ్యులు వస్తే ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు. తీరా విషయం బయటపడేసరికి అసలు కథ అర్థమవుతోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందే వైరస్ కాబట్టి అది ఏ సమయంలో, ఏ రూపంలో అది మిమ్మల్ని చేరి మృత్యువు ఒడిలోకి తీసుకెళ్లే ప్రమాదమున్నది. అందుకే.. దీనిని మన దరిన చేరకుండా ఉండాలంటే స్వీయనియంత్రణ పాటిస్తూ మనము ఇంట్లో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలసత్వం వీడి ఎప్పటికప్పుడు అప్రమత్తతతో సామాజిక దూరం పాటించాలి. ఏ వస్తువును తాకినా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. చల్లటి పానియాలు తీసుకోవొద్దు. ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

చిన్నపిల్లలు, వృద్ధులంటే..

చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి కరోనా తొందరగా సోకే అవకాశముంది. అంతేకాదు.. వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. దీంతో వారికి కరోనా సోకితే ఆ ఇంట్లోవారందరికీ కూడా కరోనా సోకే అవకాశముంది. అందువల్ల వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త ఓపికతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే అంత మేలు జరుగుతుంది.

కాలనీల్లో..

తాము నివసించే కాలనీల్లో పలు అత్యవసర సందర్భాల్లో బయటకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు, గ్లౌజులు, శానీనిటైజర్స్ వాడాలి. సామాజిక దూరం పాటించాలి. కాలనీల్లో కొత్తవారు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా వస్తే ఆరా తీసి అధికారులకు సమాచారమిందించాలి. ఎందుకంటే.. ఎవ్వరైనా కరోనా సోకిన వారు మీ కాలనీల్లో సంచరిస్తే అది మీకు కూడా సోకే అవకాశముంది. అందువల్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం బెటర్.

అశ్రద్ధ అసలే వద్దు..

మేము ఇంట్లోనే ఉన్నాము.. మాకేమైతది.. మేం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. మా ఇంట్లొళ్లను ముట్టుకుంటే ఏమైతది.. కరోనా సోకిన వారు మా ఇంట్లో ఎవరూ లేరు.. మాకు ఏ కరోనా సోకదు అన్న నిర్లక్ష్య ధోరణితో కొందరు ఉంటారు. అయితే.. మొదటగా ఆ నిర్లక్ష ధోరణిని వీడనాడాలి. ఎందుకంటే కరోనా వైరస్ గాలిలో వేగంగా వ్యాప్తి చెందే వైరస్ కాబట్టి.. అది ఎప్పుడు ఏ రూపంలో మనల్ని అర్థమవడంలేదు. అందువల్ల మనం ఎప్పటికప్పుడు అప్రమత్తతో ఉంటే మనకే మంచిది.

మన కళ్లముందే ఉన్న నిజాలు..

ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు కొందరు… ఆ ప్రాంతంలో ఉన్న కరోనా వైరస్ బారిన పడి, ఇప్పుడు ఇక్కడకు వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి… వారికి కూడా కరోనా సోకేలా చేస్తున్నారు. అయితే.. ఇటీవలే ఢిల్లీలో మతపరమైన సమావేశాల్లో మన రాష్ట్రానికి చెందిన వెయ్యికి పైగా మంది పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలు కరోనాతో పాల్గొన్నారు. అది వీరికి అంటించారు. అనంతరం వీళ్లందరూ కూడా సొంతిళ్లకు చేరుకుని ఆ వైరస్ ను కుటుంబ సభ్యులకు అంటించారు. దీంతో ప్రస్తుతం వారంతా కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఒక్కరి కారణంగా చుట్టుముట్టున్న సుమారు 50 మందికి సోకే అవకాశముంది. అందుకే పై అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణలో కూడా ఖచ్చితంగా అవసరమున్నా లేకున్నా జాగ్రత్తలు పాటించి కరోనాను కట్టడి చేయాలి.

Tags: House, care, self-regulating, corona, spreading virus

Next Story

Most Viewed