మేము వడ్లు కొనం.. తెగేసి చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి

by Shyam |
మేము వడ్లు కొనం.. తెగేసి చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎంత ధాన్యం పండినా.. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లను విస్తృతంగా నిర్వహించలేకపోతోంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ.. రాబోయే యాసంగిలో రైతులెవరూ వరి వేయొద్దని, ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో యాసంగిలో వరి కొనే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. అయితే, వానాకాలంలో పండే వరి కొనుగోళ్లను మాత్రం ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సీడ్‌ కంపెనీలతో ఒప్పందమున్న, మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు మాత్రం యాసంగిలో వరి వేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఇబ్బందిపడొద్దనే ముందే చెబుతున్నామన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే కేంద్రం కొంటుందని అక్కడి నుంచి లెటర్ తీసుకురావాలని సవాల్ విసిరారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామన్నారు. కామారెడ్డి జిల్లాలో రైతు మృతి పట్ల విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed