కరెంట్ బిల్లుల చెల్లింపుపై మోసపూరిత ఫోన్ కాల్స్ నమ్మొద్దు

by Shyam |
NPDCL CMD Raghuma Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యుత్ బిల్లులు చెల్లించాలని పలువురు నేరగాళ్లు ఇటీవల వినియోగదారులకు మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చేస్తున్నారని, అలాంటి మోసపూరిత కాల్స్‌ను ఎవరూ నమ్మొద్దని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు కాల్ చేసి విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి వెంటనే చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని బెదిరించి వారి బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు సేకరించి నగదు కాజేస్తున్నారని తెలిపారు.

విద్యుత్ సిబ్బంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాల వంటివి అసలే అడగరని, వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. వినియోగదారులకు ఎవరికైనా అలాంటి ఫేక్ కాల్స్ వస్తే.. www.tssouthernpower.com, TSSPDCL మొబైల్ యాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని, లేదా పోలీస్ సిబ్బందికి తెలపాలని సీఎండీ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed