- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎట్టకేలకు కుదిరిన ఒప్పందం.. కాంగ్రెస్‌కు 25 సీట్లు
దిశ వెబ్‌డెస్క్: త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తుండగా.. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఎన్నికల క్రమంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఇప్పుడిప్పుడే చిగురిస్తున్నాయి. మిత్రపక్షాల మధ్య ఇప్పుడిప్పుడే సీట్లు సర్దుబాటుకిి సంబంధించి క్లారిటీ వస్తోంది.
తమినాడులో AIDMK, బీజేపీ కలిసి పోటీ చేస్తుండగా.. బీజేపీకి AIDMK 20 సీట్లు కేటాయించింది. ఇక డీఎంకే, కాంగ్రెస్ మధ్య కూడా తాజాగా సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కాంగ్రెస్‌కు 25 సీట్లు ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 30 సీట్లు కావాలని పట్టుబట్టగా.. చివరికి చర్చల అనంతరం 25 సీట్లు కేటాయించేందుకు డీఎంకే ఓకే చెప్పింది.
కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటుకి సంబంధించి నిన్నటివరకు ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో.. మూడో కూటమిలోకి రావాలని కాంగ్రెస్‌ను సినీ హీరో కమల్ హాసన్ ఆహ్వానించడం రాజకీయంగా కలకం రేగింది. తాము అడిగినన్నీ సీట్లు ఇస్తామని కమల్‌హాసన్ ప్రతిపాదన కూడా పెట్టారు. దీంతో డీఎంకే అదిష్టానం వెంటనే స్పందించి.. కాంగ్రెస్‌కు 25 సీట్లను ఇచ్చేందుకు ముందుకొచ్చింది.