- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సర్కార్‌కు ఆ సోయి లేదు.. డీకే అరుణ ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో : దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూ్స్ చెప్పిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని బీజేపీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు.
గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించకపొగా, టీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు వ్యాట్‌ను తగ్గిస్తున్నాయని అన్నారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం సోయి లేకుండా ప్రజలపై భారం వేస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇన్ని రోజులు ప్రజలపై ప్రేమ ఉన్నట్లు నటించిన టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఎక్కడ పారిపోయారని ఆమె చురకలంటించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి ప్రజా సంక్షేమ పాలన అందించాలన్నారు.