- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటర్లు బెదిరింపులకు భయపడొద్దు : డీకే అరుణ
దిశ, అచ్చంపేట : ఓటర్లు అధికార పార్టీ బెదిరింపులకు శాసనసభ్యులు గువ్వల బాలరాజు తాటాకు చప్పుళ్ళకు భయపడవద్దని నిర్భయంగా మీ ఓటును సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లాలోని అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి హాజరై పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి అచ్చంపేట పట్టణ ప్రజలకు చేసింది ఏమీ లేదని, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినా కూడా అధికార పార్టీ నీళ్లు, నిధులు, నియామకాలు మేము ఉంటేనే అమలవుతాయని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని విమర్శించారు.
అచ్చంపేట మరింత అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అచ్చంపేటలో బీజేపీకి పట్టం కడితే నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడే అవకాశం ఉంటుందని, తద్వారా కోట్ల నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పట్టణంలో జరిగే ప్రతి పనిలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు అభ్యర్థులు ఉన్నారు.