యాజమాన్యంతో చర్చలు విఫలం.. విధులు బహిష్కరించిన కార్మికులు

by Sridhar Babu |
Workers Protest
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో కార్మికుల దీపావళి బోనస్ విషయం కొలిక్కి రాలేదు. దీంతో మంగళవారం ఉదయం కర్మాగారానికి వచ్చిన కార్మికులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. కర్మాగారంలో మొత్తం 922 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా, ఉదయం షిష్ట్ విధులు నిర్వహించేందుకు వచ్చిన కార్మికులు విధులు బహిష్కరించి ఫ్యాక్టరీ గేటు ఎదుట ధర్నాకు దిగారు. గతేడాది దీపావళి బోనస్ రూ.34600 చెల్లించారని, ప్రస్తుతం యూనియన్ నాయకులు అదనంగా మరో రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గతవారం రోజుల నుంచి యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో ధర్నాకు దిగామని కాంట్రాక్ట్ వర్కర్ యూనియన్ అధ్యక్షుడు సూర సమ్మయ్య, ప్రధాన కార్యదర్శి కాల్వ తెలిపారు.

Next Story

Most Viewed