నా శరీరం.. నా దుస్తులు.. నా ఇష్టం.. మధ్యలో నీకేంటి? : Divyanka

by Shyam |   ( Updated:2021-06-01 02:53:14.0  )
నా శరీరం.. నా దుస్తులు.. నా ఇష్టం.. మధ్యలో నీకేంటి? : Divyanka
X

దిశ, సినిమా : హిందీ టెలివిజన్ యాక్ట్రెస్ దివ్యాంక త్రిపాఠి నెటిజన్‌కు బేఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ కేప్ టౌన్‌లో ‘ఖత్రోం కే ఖిలాడీ 11’ షోలో పాల్గొంటున్న ఆమె.. తన దుస్తుల గురించి ప్రశ్నించిన నెటిజన్‌పై ఫైర్ అయింది. క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్‌లో చున్నీ ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించగా.. స్కార్ఫ్ వేసుకోకపోయినా తప్పుపట్టే మీలాంటి వారు మహిళలను గౌరవించడం నేర్చుకుంటే మంచిదని సమాధానమిచ్చింది.

స్త్రీలను చూసే ధోరణిని మార్చుకోవడం బెటర్ అన్న ఆమె.. అయినా ‘నా శరీరం, నా గౌరవం, నా ఇష్టం’ మధ్యలో అడిగేందుకు మీరెవరని ప్రశ్నించింది. ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పింది. దీనిపై స్పందించిన నెటిజన్లు దివ్యాంకకు సపోర్ట్ చేశారు. మహిళలు వేసుకునే దుస్తులు, శరీర భాగాలు మ్యాటర్ కాదు.. పురుషులు చూసే చూపు, మైండ్‌లో మార్పు తెచ్చుకుంటే బాగుంటుందన్నారు.

Advertisement

Next Story