- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున సాగర్‌లో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
దిశ, నాగార్జునసాగర్ : హాండ్స్ ఆఫ్ హోప్ సొసైటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీ బీసీ స్కూల్ గ్రౌండ్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్‌ను టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ణ బ్రహ్మానందరెడ్డి, అబ్బాస్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ అబ్బాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీయాలనే క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలకు సంబంధించి 40 కిలోమీటర్ల పరిధిలోని క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ క్రీడా పోటీలకు పి.విక్కీ నెహమియా స్పాన్సర్ షిప్ గా ఉన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజనీకాంత్, మహాత్మ జ్యోతిరావు పూలే కళాశాల ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, నందికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మందా రఘువీర్, కృష్ణ, బానోతు రంగ నాయక్, శివ, తదితరులు పాల్గొన్నారు.