- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్ర నిధులు పక్కదారి పట్టిస్తున్నారు : ఎంపీ అర్వింద్
దిశ, నిజామాబాద్: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు రాష్ర్ట ప్రభుత్వమే పక్కదారి పట్టిస్తున్నదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక కేటాయింపుల కింద కేంద్ర ప్రభుత్వం ఆర్‌అండ్‌బీకి రూ.160 కోట్లు, పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంటుకు రూ.25.5 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎంపీ అర్వింద్ అన్నారు. అయితే పనులకు కాకుండా ఈ నిధులను ఇతర అవసరాలకు వాడాటాన్ని సభ్యులు తప్పుపట్టారు. దీంతో ఎంపీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులను ఎలాగైనా ప్రతిపాదిత పనులకు మాత్రమే ఉపయోగించాలని లేకుంటే, వేరే పరిణామాలు ఉంటాయని మందలించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.