చిన్నారులకు విటమిన్ 'ఏ' సిరప్ పంపిణీ

by srinivas |
చిన్నారులకు విటమిన్ ఏ సిరప్ పంపిణీ
X

దిశ, వెబ్‎డెస్క్ : చిన్నారుల ఆరోగ్యం కోసం ఏపీ సర్కారు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఐదేళ్లలోపు చిన్నారులు రేచీకటి బారిన పడకుండా వారిని కాపాడేందుకు విటమిన్ ‘ఏ’ సిరప్‎ను ఉచితంగా పంపిణీ చేస్తోంది. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అంగన్‎వాడీ కేంద్రాల్లో చిన్నారులకు విటమిన్ ‘ఏ’ సప్లిమెంట్ సిరప్‎ను అందిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లల తల్లిదండ్రులు దగ్గరలోని అంగన్ వాడీ కేంద్రాల్లో సిరప్‎ను అందించాలని ప్రభుత్వం సూచించింది.

Advertisement

Next Story