- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త రేషన్ కార్డులపై కేసీఆర్ కీలక నిర్ణయం..
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ నెల 26వ తేదీన మొదలుకావాలని, 31వ తేదీకల్లా పూర్తికావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో 3.60 లక్షలు అర్హతకు అనువైనవిగా గుర్తించినందున ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విధిగా పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టాల్సిందిగా మంత్రి గంగుల కమలాకర్‌ను ఆదేశించారు. మొత్తం ఆరు రోజుల్లోనే కొత్త కార్డులను లబ్దిదారులకు అందించడం పూర్తికావాలని స్పష్టం చేశారు. ఆగస్టు నెల మొదటి వారంలోనే చౌకధరల దుకాణాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు బియ్యం అందించాలని నొక్కిచెప్పారు. ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా ఆ శాఖ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు.
రాష్ట్ర మంత్రివర్గం గత నెలలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జూన్ 25వ తేదీకల్లా పూర్తి కావాల్సి ఉన్నది. కమిషనర్ సైతం ఆ మేరకు క్లారిటీ ఇచ్చారు. అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులకు సర్క్యులర్ ద్వారా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.97 లక్షల కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. అర్హత కలిగినవాటిని గుర్తించడం కోసం 360 డిగ్రీల విధానం గురించి కూడా నొక్కిచెప్పారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన 4,97,389 దరఖాస్తుల్లో కొన్ని తిరస్కరణకు గురయ్యాయని, దాదాపు 4.46 లక్షల మేరకు మంజూరయ్యే అవకాశం ఉందని సూచనప్రాయంగా తెలిపారు.
చివరకు అన్ని దశల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తయిన తర్వాత అది 3.60 లక్షలకు తగ్గిపోయింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరు రోజుల్లో వీటిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పౌరసరఫరాల శాఖ సిబ్బంది, మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్దిదారులకు అందించనున్నారు.