ఏపీకి 92, తెలంగాణకు 82 టీఎంసీలు

by srinivas |
Krishna River
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల వాటా ఖరారైంది. ఇప్పటి వరకు రెండుసార్లు సమావేశమైన త్రిసభ్య కమిటీ ఎట్టకేలకు నీటి కేటాయింపులను ఖరారు చేసింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరిపింది. తెలంగాణకు 82.92 టీఎంసీలు, ఏపీకి 92.50 టీఎంసీల నీటి విడుదలకు అనుమతి తెలిపింది. వీటిని వచ్చేనెలాఖరు వరకు మాత్రమే కోటా ఖరారు చేసింది.

మార్చి 31 వరకు ఈ కేటాయింపులు చేసింది. తెలంగాణ నీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 17.92 టీఎంసీలు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ద్వారా 40 టీఎంసీలు, ఏఎమ్మాఆర్​పీ ద్వారా 18 టీఎంసీలు, హైదరాబాద్​ తాగునీటి అవసరాల కోసం 4.50 టీఎంసీలు కేటాయించింది. అదే విధంగా మిషన్ భగీరథ కోసం మరో 2.50 టీఎంసీలను కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

Advertisement

Next Story