టీజేఎస్ ఆధ్వర్యంలో అన్నదానం, పండ్ల పంపిణీ

by Shyam |
టీజేఎస్ ఆధ్వర్యంలో అన్నదానం, పండ్ల పంపిణీ
X

దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలను విస్త్రృతంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ జన సమితి గ్రేటర్ అధ్యక్షుడు ఎం. నర్సయ్య అన్నారు. ఇంట్లోనే ఉందాం.. ప్రజా సేవ చేద్దాం అని కోదండరామ్ ఇచ్చిన పిలుపు మేరకు వారం రోజులుగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యానగర్, రాంనగర్, గాంధీనగర్, చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ, సీతాఫల్‌మండీ, సైదాబాద్, గోషామహాల్, బీఎన్‌రెడ్డినగర్, షేక్‌పేట ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు, పేదలు, వలస కార్మికులకు అన్నదానం, పండ్లు, కూరగాయలు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆపత్కాలంలో పేదలకు ఎంత సాయం చేసినా తక్కువేనని, తోటి మానవులు కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆదుకోవాలనే సామాజిక బాధ్యతను మరువద్దన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పేదలందరికీ ఉచిత బియ్యంతో పాటు రూ.5 వేలను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఆవుల బలరాం, ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మెరుగు శ్రీనివాస్ యాదవ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు ఎస్. జశ్వంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రగిరి సత్యనారాయణ, హనుమంతు గౌడ్, కాకునూరి సుధాకర్, రొమాన్సింగ్, బి. రామచంద్ర పాల్గొన్నారు.

Tags: Corona, Lockdown, Distribution Food, Vegetables, Telangana Jana Samithi, M. Narsaiah, Hyderabad, Kodandaram

Advertisement

Next Story

Most Viewed