- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, హైదరాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో గాంధీనగర్ డివిజన్ అన్నానగర్ బస్తీ వాసులకు లర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ, అప్సా పద్మ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హజరై బస్తీ ప్రజలకు సరుకులను అందజేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రజలు సరైన అవగాహనతో క్రమశిక్షణ అలవర్చుకోవాలని అన్నారు. ప్రభుత్వం, వైద్యులు చెబుతున్న సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి పోతుల శ్రీకాంత్, నర్సింగ్ రావు, సీనియర్ నాయకులు ముఠా నరేష్, కుమారి తదితరులు పాల్గొన్నారు.
Tags: orona, apsaa padma, space foundation, TRS, MLA Mutaa Gopal, Basti people, anna nagar, essentials, distributaion