- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ
దిశ, నల్గొండ: లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీశ్ రెడ్డి అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం 108 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కరువులో ఆదుకున్న మంత్రికి బ్రాహ్మణ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 కూరగాయల మార్కెట్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేట త్వరలో ఆరెంజ్ జోన్‌లోకి రాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యల వల్లే మంచి ఫలితాలను సాధించామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలియజేశారు. ఇందులో భాగంగానే కూరగాయల మార్కెట్‌ను వికేంద్రీకరణ చేశామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక మున్సిపల్ ఛైర్మన్ అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.