- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపటి నుంచి బ్రూసెల్లోసిస్ నివారణ టీకాల పంపిణీ
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి జనవరి 2వరకు బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రకటించారు. 4నుండి 8నెలల వయసు గల ఆవు, గేదె జాతి ఆడ దూడలకు ఈ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈవ్యాధి బృసెల్లా అనే బ్యాక్టీరియా ( సూక్ష్మక్రిమి) ద్వారా అనేక రకాల జంతువులు గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు, జింకలు, అడవి జంతువులు, మనుషులకు సోకుతుందన్నారు. ఈవ్యాధి తక్కువ ఉష్ణోగ్రతల్లో, అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితులలో పశువులకు సోకుతుందని, పశువు సంపర్కం ద్వారా కూడా ఇతర పశువులకు, ఈనిన తర్వాత మావి, గర్భస్రావ ద్రవాల ద్వారా, నోటిలో, కంటిలో పడి, మనుషులకు, పశువులకు వ్యాపిస్తుందని హెచ్చరించారు.
Advertisement
Next Story