- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ‘ఎఫెక్ట్’.. ఎట్టకేలకు కదిలిన జిల్లా విద్యాధికారి
దిశ, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి, లాలయ్యపల్లి గ్రామాల్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, లాలయ్యపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వి.జనార్దన్ రావు శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వివరాలు, మిషన్ భగీరథ కనెక్షన్స్ పరిసరాల పరిశుభ్రత వంటి వివరాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాల లాలయ్య పల్లెను సందర్శించి మద్యం బాటిల్స్, గ్లాసులు పగలగొట్టిన ప్రదేశాన్ని సందర్శించి స్థానిక సర్పంచ్ కానుగంటి భూమిరెడ్డితో మాట్లాడారు.
స్థానిక యువత సహకారంతో పాఠశాల పరిసర ప్రాంతాల్లో మద్యం తాగకుండా గస్తీని ఏర్పాటు చేయాలని కోరారు. పాఠాశాల వద్ద పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆర్.విజయలక్ష్మి, మండల పరిషత్ సూపరిండెంట్ ఎండీ ఖాజామొనద్దీన్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.