దిశ ఎఫెక్ట్‌.. గూడూరు ఎఫ్ఆర్వోపై స‌స్పెన్షన్ వేటు

by Anukaran |
దిశ ఎఫెక్ట్‌.. గూడూరు ఎఫ్ఆర్వోపై స‌స్పెన్షన్ వేటు
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ అమృత‌పై స‌స్పెన్షన్ వేటు ప‌డింది. ఎఫ్ఆర్వో అమృత‌ కంపా నిధుల‌ను దుర్వినియోగం చేసేందుకు ప్రయ‌త్నించిన‌ట్లు విచార‌ణ‌లో తేల‌డంతో చ‌ర్యలు తీసుకోవాల‌ని భ‌ద్రాద్రి కొత్తగూడెం సీసీఎఫ్ భీమానాయ‌క్‌ను పీసీసీఎఫ్ శోభారాణి ఆదేశించారు. ఈమేర‌కు అమృత‌ను స‌స్పెన్షన్ చేస్తున్నట్లు సీసీఎఫ్ భీమానాయ‌క్ ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు ఫారెస్ట్‌ రేంజ్ ప‌రిధిలో ప‌లు అభివృద్ధి ప‌నుల కోసం మంజూరైన‌ కంపా నిధుల‌ను ఎఫ్ఆర్వో కాజేసిన విష‌యాన్ని దిశ దిన ప‌త్రిక ఆధారాల‌తో స‌హా వెలుగులోకి తీసుకుని వ‌చ్చిన తెలిసిందే.

రేంజ్ ప‌రిధిలోని ఆరు సెక్షన్ అధికారుల ఖాతాల‌కు 15శాతం త‌క్కువ మొత్తాలు బ‌దిలీ అయిన విష‌యం విచార‌ణ‌లో కూడా తేట‌తెల్లమైంది. 15 శాతం త‌న వాటాగా తీసుకుని మిగిలిన 85శాతం నిధుల‌ను సెక్షన్ అధికారుల ఖాతాల‌కు ఎఫ్ఆర్వో న‌గ‌దు బ‌దిలీ చేశారు. 15శాతం చేతిగుండా అంద‌జేసిన‌ట్లు బుకాయించే ప్రయ‌త్నం చేశారు. ఇందుకు సెక్షన్ ఆఫీస‌ర్లపైనా తీవ్రమైన ఒత్తిడి జ‌రిగినా మాట వాస్తవం. ఈ అక్రమంపై దిశ ఎప్పటిక‌ప్పుడు వ‌రుస‌గా క‌థ‌నాలు ప్రచురించ‌డంతో ఉన్నతాధికారులు కూడా ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుని విచార‌ణ జ‌రిపించారు. ఎఫ్‌ఆర్వో అవినీతి నిరూపితం కావ‌డంతో పీసీసీఎఫ్ శోభారాణి స‌స్పెన్షన్‌కు ఆదేశించారు. అట‌వీశాఖ‌లో జ‌రుగుతున్న అవినీతి దిశ వెలుగులోకి తీసుకురావ‌డంపై ప్రజానీకం హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed