దిశ ఎఫెక్ట్: స్పందించిన పోలీసు అధికారులు…

by Shyam |
దిశ ఎఫెక్ట్: స్పందించిన పోలీసు అధికారులు…
X

దిశ, జల్‌పల్లి : కరోనా సేకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసింది. అయితే షాహిన్‌నగర్‌లో లాక్‌డౌన్ సమయంలో రాత్రిపూట బయటకు వచ్చిన వారిపై కొంతమంది దుండగులు బైక్‌పై తిరుగుతూ లాఠీలతో దాడి చేశారు. ఈ విషయాన్ని ‘దిశ’ పత్రిక ’లాఠీగ్యాంగ్ హల్‌చల్’ అనే శీర్షిక ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో స్పందించిన పోలీసులు షాహీననగర్ వాసులకు భరోసా కల్పించడానికి గుర్రాలపై గస్తీ నిర్వహించాలని బాలాపూర్ పోలీసులకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. గస్తీ కోసం బాలాపూర్ పోలీస్ స్టేషన్ కు ప్రత్యేకంగా గుర్రాలను పంపించారు.

రంగారెడ్డి జిల్లా షాహిన్‌నగర్ పరిసర ప్రాంతాలలో బాలాపూర్ ఇన్ స్పెక్టర్ భాస్కర్ బృందం గుర్రాలపై పై గస్తీ నిర్వహించారు. షాహిన్‌నగర్ వాసులు లాఠీ గ్యాంగ్ లకు భయపడాల్సిన అవసరం లేదని బాలాపూర్ పోలీసులు మీ వెంట ఉన్నారని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు ప్రాంతాలలో కొత్తపేట్, శివాజీ చౌక్, ఎర్రకుంట ప్రాంతాల్లో చెక్ పోస్ట్ లు ఇప్పటికే వేశామని తెలిపారు. అనవసరంగా రోడ్లమీద కు రావొద్దని, అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని , లాక్‌డౌన్ నియమ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలాపూర్ ఇన్ స్పెక్టర్ భాస్కర్ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed