- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో.. అలక పాన్పుపై టీఆర్ఎస్ నేతలు..?
దిశ, ఘట్‌కేసర్ : అధికార టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది..? బడుగు బలహీన వర్గాల నేతలు పార్టీ పదవులకు అర్హులుకారా..? మేము ఓట్లు వేయించేందుకేనా..? మాకు ఎందుకు మొండి చేయి..? ఎంతకాలం ఈ పల్లకి మోయాలి..? ఘట్‌కేసర్‌లోనే ఈ పరిస్థితి అని ప్రశ్నిస్తున్న నాయకులు..? పార్టీ స్థాపించింది మొదలు నేటి వరకు పార్టీ కోసం పనిచేసిన మాకు తగిన గుర్తింపు లేదని ఆవేదనతో ఉన్నారు కొందరు నేతలు. పార్టీ పదవులు, అధికారిక నామినేటెడ్ పదవులు అగ్రవర్ణాలకే కేటాయిస్తూ తమకు మొండి చేయి చూపిస్తున్నారని బడుగు బలహీనవర్గాల నేతలు అసంతృప్తిలో ఉన్నారు.
ఓట్లపరంగా అధిక జనాభా కలిగి ఉన్న మమ్ములను పార్టీ పెద్దలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్పితే, పదవుల విషయం వచ్చేవరకు పక్కకు పెడుతున్నారు అని ఆవేదనతో ఉన్నారు. 85 శాతానికి పైగా ఉన్న మమ్ములను రిజర్వుడు స్థానాలకే పరిమితం చేస్తూ చిన్న చూపు చూస్తున్నారంటున్నారు. న్యాయం జరగకపోతే ఇకపై సహించేది లేదంటూ అలక పాన్పు ఎక్కుతున్నారు. ఈ దఫా గ్రామ కమిటీ మొదలు రాష్ట్ర కమిటీ వరకు సముచిత స్థానం కల్పించక పోతే పార్టీ వీడేందుకు సైతం వెనుకాడేది లేదని ఆయావర్గాల నేతలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ లేదని ఈ ఒక్క ఉమ్మడి ఘట్‌కేసర్ మండలంలోనే ఈ పరిస్థితి ఉందని, ఇది ఈ మండలంలో పుట్టడమే పాపమా అని వాపోతున్నారు. ఉమ్మడి ఘట్‌కేసర్ మండలం ప్రస్తుతం రూరల్ మండలం ఘట్‌కేసర్, పోచారం మున్సిపాలిటీలుగా ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులను గుర్తించి వారి వారి స్థాయిని బట్టి పార్టీ కమిటీలలో, నామినేటెడ్ పదవులలో స్థానం కల్పించాలి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని వర్గాల నేతలకు సమన్యాయం చేయాలని వేడుకుంటున్నారు.