- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగిల్ విండో చైర్మన్ నిర్లక్ష్యం.. డైరెక్టర్ల నిరసన
దిశ, వేములవాడ : చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తిప్పని శ్రీనివాస్ వైఖరికి నిరసనగా చందుర్తి సహకార సంఘం కార్యాలయం ఎదుట సంఘం డైరెక్టర్లు ఆదివారం నిరసనకు దిగారు. రైతుల ధాన్యం కొనుగోలు పట్ల సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ పక్షపాత వైఖరి, నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారని సహకార సంఘం డైరెక్టర్లు ఆరోపించారు. వర్షాకాలం సమీపించినా, ధాన్యం కళ్లాల్లో తడిసిపోతున్నా, తూకం వేసిన బస్తాలు మొలకలు వస్తున్నా చైర్మెన్ పట్టించుకోవడం లేదన్నారు. చైర్మన్‌కు అనువుగా ఉన్న రైతులకు, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పరిధి రైతుల ధాన్యాన్ని మాత్రమే కళ్లాల నుండి తూకం వేసి మిల్లుకు పంపడం జరుగుతుందన్నారు.
కృత్రిమ లారీల కొరత సృష్టించి మిగతా డైరెక్టర్‌లు ప్రాతినిథ్యం వహించే రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. తాలు ఉండి మొలకెత్తిన ధాన్యాన్ని రెండ్రోజుల్లో కొనుగోలు చేయాలని, లేనియెడల మరింత ఆందోళన చేపడుతామన్నారు. రైతులతో కలిసి రోడ్లపై రాస్తారోకో చేస్తామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సహకార సంఘం డైరెక్టర్ చింతపంటి రామస్వామి అన్నారు. కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు అంచ శ్రీహరిరెడ్డి, శంకర్ రెడ్డి, నాగం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.