- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవ్ యూ చెప్పమంటూ.. నిధిని ఇబ్బందిపెట్టిన డైరెక్టర్
దిశ, వెబ్‌డెస్క్ : ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ కోలీవుడ్‌లో దూసుకుపోతోంది. ‘ఈశ్వరన్’, ‘భూమి’ సినిమాలతో సంక్రాంతికి సందడి చేయనున్న నిధి.. ఇదే క్రమంలో మరిన్ని ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టింది. జనవరి 14న థియేటర్లలో ‘ఈశ్వరన్’ రిలీజ్ అవుతుండగా.. 3వ తేదీన ఆడియో లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులకు థాంక్స్ చెప్తూ స్పీచ్ ఇచ్చింది నిధి. ఈ క్రమంలోనే డైరెక్టర్ సుశీంద్రన్.. శింబుకు ‘ఐ లవ్ యూ’ చెప్పాలని డిమాండ్ చేశాడు. అయినా ఇదేమీ పట్టించుకోకుండా తను స్పీచ్ కంటిన్యూ చేస్తుండగా, మళ్లీ అదే అదే రిపీట్ చేస్తూ ఒత్తిడి చేశాడు. శింబుకు లవ్ యూ చెప్పి తీరాలని ఫోర్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ఫైర్ అయ్యారు. అంతగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరముందా? అని మండిపడ్డారు.
https://twitter.com/sujanvj/status/1345455556052578307?s=20
మొత్తానికి నెట్టింట నెగెటివిటీ ఎదుర్కొన్న డైరెక్టర్ సుశీంద్రన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. నిధిని కావాలని ఇబ్బంది పెట్టలేదని.. ‘మామా లవ్ యూ’ అంటూ తను సినిమాలో శింబు వెంట పడుతుందని.. అందుకే తనను ఆ డైలాగ్ చెప్పాలని కోరానని తెలిపాడు. ఈ వీడియో చూశాక తనకు కూడా నిధిని ఇబ్బంది పెట్టినట్లు అనిపించిందని క్షమాపణలు చెప్పాడు.