'పవన్‌‌స్టార్‌తో సినిమా చేసి తీరుతా'

by Shyam |   ( Updated:2022-09-03 10:04:38.0  )
పవన్‌‌స్టార్‌తో సినిమా చేసి తీరుతా
X

రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత దాదాపు రెండేండ్లుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నఉన్నారు. కాగా ఇప్పుడే మళ్లీ సినిమాలపై దృష్టి సారించి వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ఇప్పటికే దిల్‌రాజు నిర్మాణంలో పింక్ మూవీ రీమేక్ 'వకీల్‌సాబ్' సినిమా 80 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా మూవీ కూడా దాదాపు పట్టాలెక్కి షూటింగ్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం. కానీ కరోనా కారణంగా సినిమాలు ఆగిపోయాయి. దీంతో దర్శకులు కథల్లో మార్పులు చేర్పులు, కొత్త కథలు రాసుకునే పనిలో పడ్డారు. ఈ రెండు చిత్రాలే కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్‌లో మరో చిత్రం కూడా పపర్‌స్టార్ చేయనున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హరీష్ శంకర్ ఆ చిత్రం కోసం స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్నారు. అంతే కాకుండా పూరీ జగన్నాధ్, డాలీ, త్రివిక్రమ్ వంటి వారు పవర్ స్టార్‌తో సినిమా చేసేందుకు కథలు రెడీ చేసుకున్నట్టు సమాచారం. వీళ్లే కాకుండా తాజాగా మరో దర్శకుడు పవన్ కల్యాణ్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా చేస్తానంటున్నాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో రచ్చ సినిమా తీసిన సంపత్ నంది. ఇటీవల సంపత్ నంది ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌తో ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పారు. 'ఖచ్చితంగా పవన్ కల్యాణ్‌గారితో సినిమా చేస్తా. స్ర్కిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ప్రస్తుతం గోపీచంద్‌గారితో చేస్తున్న సినిమా పూర్తి కాగానే పవన్ కల్యాణ్‌గారిని కలిసి కథ వినిపిస్తా. ఆయన నాకు మాట కూడా ఇచ్చారు. తర్వాత సినిమా చేద్దాం.. అని. అంతా రెడీ చేసి ఈసారి పక్కా ప్లానింగ్‌తో పవన్ కల్యాణ్‌గారితో సినిమా చేస్తా' అని సంపత్ నంది తెలిపారు.

Advertisement

Next Story