మాలీవుడ్ డైరెక్టర్ ‘సాచి’ పరిస్థితి విషమం..

by Shyam |
మాలీవుడ్ డైరెక్టర్ ‘సాచి’ పరిస్థితి విషమం..
X

మాలీవుడ్ స్టార్స్ పృథ్వీరాజ్, బిజూ మీనన్ కలయికలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తీసి బిగ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ సాచి. క్లాసిక్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన మూవీగా నిలిచింది. రచయితగా ఉన్న సాచి తొలిసారిగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా తెలుగు, హిందీ రీమేక్ హక్కులు ఇప్పటికే అమ్ముడుపోయాయి.

కాగా, ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని సమాచారం. కేరళ త్రిసూర్‌లోని జూబిలీ మిషన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ‘సాచి’ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్ సపోర్ట్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ‘తాను క్రిటికల్ కండిషన్‌లోనే ఇక్కడ చేరాడని.. మేమెలాంటి సర్జరీ చేయలేదని’ అక్కడి వైద్యులు తెలిపారు. జూన్ 15న హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరగగా.. తొలి సర్జరీ సక్సెస్ అయిందని, కానీ రెండో సర్జరీ టైమ్‌లో హార్ట్ ఎటాక్ రావడంతో బ్రెయిన్ డామేజ్‌కు దారితీసిందని వెల్లడించారు. సిటీ స్కాన్ చేశామని త్వరలో మరిన్ని వివరాలు అందిస్తామని చెప్పారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ జాన్ మహేంద్రన్ తన సోషల్ మీడియా హాండిల్‌లో వెల్లడించారు.

https://twitter.com/johnroshan/status/1272818583395905538?s=20

ఈ వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సాచి త్వరగా రికవరీ కావాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.

Advertisement

Next Story