అప్పుల బాధతో సహకార సంఘం డైరెక్టర్ ఆత్మహత్య

by Aamani |
అప్పుల బాధతో సహకార సంఘం డైరెక్టర్ ఆత్మహత్య
X

దిశ, ఆదిలాబాద్: అప్పుల బాధ తట్టుకోలేక ఓ సహకార సంఘం డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. ఖానాపూర్‌ సహకార సంఘం డైరెక్టర్ బాస రవీందర్ వివిధ అవసరాల నిమిత్తం సుమారు రూ.40లక్షల వరకూ అప్పులు చేశారు. అప్పుల భారాన్ని భరించలేక, ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనో వేధనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story