- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు అకాల మరణం
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినీ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు అనారోగ్యంతో అకాల మరణం చెందారు. వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు శుక్రవారం తన స్వగ్రామం నుంచి హైదరాబాద్ వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చింది. దీంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయనను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్ల ముందే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రంతి వ్యక్తం చేస్తున్నారు. మృతికి సంతాపం తెలుపుతున్నారు. నాగేశ్వరరావు ‘రిక్షా రుద్రయ్య’ సినిమాతో దర్శకుడిగా మారారు. దివంగత శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ ‘పోలీస్’ సినిమాను తెరకెక్కించారు. తాజాగా తన కుమారుడిని పరిచయం చేస్తూ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో కలిసి ఒక సినిమా ప్లాన్ చేసినట్టు సమాచారం.