- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీస్ స్టోరీస్ తీసినందుకు సిగ్గుపడుతున్నా: హరి
by Shyam |
X
తమిళనాడు ట్యుటికోరిన్ ఘటనలో ఖాకీల కర్కశత్వానికి తండ్రీకొడుకులు జయరాజ్, ఫెనిక్స్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా, సింగర్ సుచిత్ర షేర్ చేసిన వీడియోతో ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ అయింది. లాకప్‌లో పోలీసులు చూపించిన నరకానికి ఇద్దరు చనిపోగా.. ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ సినీ ప్రముఖులు, సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో డైరెక్టర్ హరి కూడా ఈ విషయంపై స్పందించారు. పోలీస్ ఆఫీసర్ గొప్పతనాన్ని చాటి చెప్తూ సింగం, సింగం 2, సింగం 3, సామి, సామి సీక్వెల్ సినిమాలు తెరకెక్కించిన ఈ డైరెక్టర్.. ఈ చిత్రాలు తీసినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. ఇలాంటి కొందరు పోలీసులు చేసిన చర్యలు మొత్తం పోలీస్ యంత్రాంగానికి చెడ్డ పేరు తెచ్చిపెడతాయని అన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు హరి.
Advertisement
Next Story