‘వకీల్ సాబ్‌’ లో పవన్ ఎంట్రీ ఎప్పుడంటే…

by Anukaran |
‘వకీల్ సాబ్‌’ లో పవన్ ఎంట్రీ ఎప్పుడంటే…
X

దిశ, సినిమా : వకీల్ సాబ్‌ ద్వారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్న తన 22 ఏళ్ల కల నెరవేరిందన్నారు నిర్మాత దిల్ రాజు. పవన్‌తో మూవీ చేయడం సంతృప్తినిస్తే.. వకీల్ సాబ్ సక్సెస్ అదనపు సంతోషాన్ని ఇస్తుందన్నారు. కథను డిస్టర్బ్ చేయకుండా, మూవీ ఫార్ములా చెడిపోకుండా, పవన్ ఇమేజ్‌కు తగినట్లుగా దర్శకుడు శ్రీరామ్ వేణు కథపై చాలా వర్క్ చేశాడని.. తనకు ఈ సినిమా కత్తిమీద సాములాంటిదని తెలిపారు. పవన్ స్టూల్ అడాప్ట్ చేసుకుని సినిమా చేశామన్న దిల్ రాజు.. సినిమా అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే మతిపోతుందన్నారు. వకీల్ సాబ్‌లో 15వ నిమిషంలో పవర్ స్టార్ ఎంట్రీ ఉంటుందని, అభిమానులు సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయిపోమని చెప్పాడు నిర్మాత.

Advertisement

Next Story