Alcohol: బీర్‌తో జుట్టు ఆరోగ్యం.. ఎలాగో తెలుసా..?

by Anjali |
Alcohol: బీర్‌తో జుట్టు ఆరోగ్యం.. ఎలాగో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బీర్ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రజెంట్ డేస్‌లో వయసుతో సంబంధం లేకుండా బీర్ తాగుతున్నారు. సంతోషం వచ్చినా బాధొచ్చినా, అనుకోకుండా ఫ్రెండ్స్ కలిసినా, పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో బీర్ తాగడం సాధారణం అయిపోయింది. అయితే ఇలా సిట్టింగ్‌లో కూర్చుని బీర్ తాగాక.. లాస్ట్‌లో కాస్త మిగిలి ఉంటుంది. మరీ ఆ మిగిలపోయిన బీర్‌తో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇకపోతే ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ సమస్యతో అనేక మంది సఫర్ అవుతున్న విషయం తెలిసిందే. కేవలం జుట్టు రాలడమే కాకుండా.. ఏకంగా బట్టతల కూడా వచ్చేస్తుంది. అలాగే పొల్యూషన్ కారణంగా కూడా హెయిర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాగా పలు షాంపూస్, పలు రకాల ట్రీట్మెంట్లు, ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ వాడుతుంటారు. ఇవన్నీకాకుండా బీర్ కూడా బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

బీర్ అనేది కేవలం రిఫ్రెషింగ్ డ్రింక్‌ కాకుండా జుట్టుకు షాంపుగానూ పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.. ఇందుకోసం మీరు స్పెషల్‌గా షాంపూ కొనాల్సిన అక్కర్లేదు. చివర్లో మిగిలిన బీర్‌తో మీ హెయిర్‌ను ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ఇది హెయిర్ హెల్త్ కు విటమిన్లతో పాటు ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు హెల్ప్ చేస్తాయని పేర్కొంటున్నారు.

బీర్‌లో ప్రోటీన్లు దట్టంగా ఉంటాయి కాబట్టి.. దెబ్బతిన్నహెయిర్ రిపేర్ చేస్తుంది. అలాగే కుదుళ్లను స్ట్రాంగ్‌గా ఉంచడంలో మేలు చేస్తుంది. అలాగే దీనిలోని విటమిన్ బి హెయిర్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. బీర్‌లోని పొల్యూషన్ కారణంగా హెయిర్‌కు కలిగిన నష్టాన్ని యాంటీ ఆక్సిడెంట్లు మేలు చేస్తాి. అలాగే బీర్‌లోని సుక్రోజ్, మాల్టోజ్ షుగర్స్ ఫాలికల్స్‌ను బిగించి మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అయితే బీర్ ను జుట్టుకు అప్లై చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బీర్ నురగ పోవడానికి రాత్రంతా అలాగే ఉంచండి. అలాగే కార్బన్‌డైయాక్సైడ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. పోషకాలు కూడా సమర్థంగా శోషణం అవుతాయి. ఇక హెయిర్ మొత్తం వాష్ చేసుకుని ఉంచుకోవాలి.హెయిర్ కండిషనర్ వంటివి వాడకూడదు.

ఎందుకంటే బీర్ లోని పోషకాలు హెయిర్‌పై డైరెక్ట్ ప్రభావం చూపించదు. నార్మల్ వాటర్‌తో స్నానం చేశాక.. బీర్‌ను తలకు అప్లై చేయాలి. మంచిగా మర్దన చేసినాక 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత నార్మల్ వాటర్‌తో తేలికపాటి షాంపూతో కడగండి. ఇలా వీక్లీ ఒకసారి చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Advertisement
Next Story