Viral video: డేగ పవర్‌ఫుల్ హాంటింగ్.. చూస్తే గూస్‌బంప్స్!

by D.Reddy |
Viral video: డేగ పవర్‌ఫుల్ హాంటింగ్.. చూస్తే గూస్‌బంప్స్!
X

దిశ, వెబ్ డెస్క్: గద్దలు, డేగలు, రాబందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవి ఒక్కసారి తమ వేటను టార్గెట్ చేశాయంటే.. వాటి దాడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఆకాశంలో విహరిస్తూనే.. నేలపై చిన్ని చిన్న జీవులను, సముద్రంలోని చేపలను సైతం ఇట్టే పసిగట్టి వేటాడేస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం మనం చూస్తుంటాం. అయితే, తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో డేగ ఎంత పవర్‌ఫుల్‌గా వేటాడుతుందో మనం చూడొచ్చు.

ఓ డేగ (Eagle) ఆకాశం నుంచి అత్యంత వేగంగా సముద్రంలోకి దూసుకొచ్చింది. నీళ్లలో మునిగిపోయిందేమో అనుకునేలోపే ఒక్కసారిగా పైకి వచ్చింది. అయితే, అది ఒక్కతే రాలేదు, దాని పదునైనా కాళ్ల గోళ్లతో ఓ పెద్ద చేపను కూడా పట్టుకొచ్చింది. ఇక డేగ కాళ్ల మధ్య చిక్కుకున్న చేప ఎంత విలవిలలాడిన దాన్ని విడిచిపెట్టకుండా అలాగే గట్టిగా పట్టుకుని గాల్లోకి ఎగిరిపోయింది. ఇక నెట్టింట వైరల్ అవతోన్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పవర్‌ఫుల్ హంటింగ్ అని, గూస్‌బంప్స్ వీడియో అంటూ, డేగ పవర్ అసాధారణమని రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed