ఫిల్మ్ నగర్ బజ్… అనుష్క వెడ్స్ దిల్ రాజు?

by Shyam |
ఫిల్మ్ నగర్ బజ్…  అనుష్క వెడ్స్ దిల్ రాజు?
X

అరుంధతి.. భాగమతి… దేవసేన… రుద్రమదేవి… పాత్ర ఏదైనా ప్రాణం పోసింది అనుష్క శెట్టి. ఎంట్రీలో గ్లామర్‌ డాల్‌గా అలరించిన స్వీటీ… తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రలతో మెప్పిస్తుంది. హీరోలకు ధీటుగా హిట్స్ కొడుతూ దర్శక, నిర్మాతలకు ఒంటి చేత్తో బ్లాక్ బస్టర్‌లు అందిస్తోంది. త్వరలో విడుదల కానున్న నిశ్శబ్దం సినిమాతో మరో సూపర్‌హిట్ తన ఖాతాలో వేసుకుంటానంటోంది.

కెరియర్ పరంగా అసలు వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా ఉన్న అనుష్క పర్సనల్ లైఫ్‌ గురించి అభిమానులకు ఒకటే బాధ. అనుష్క పెళ్లి ఎప్పుడు? అని. తొలుత గోపీచంద్‌తో అనుష్క లవ్‌లో ఉందని వార్తలు వచ్చినా ఆ తర్వాత ప్రభాస్‌తో లవ్ ట్రాక్ నడుస్తోందని న్యూస్ వినిపించింది. హైట్, వెయిట్ బాగా మ్యాచ్ అవుతుందని, ప్రేమ ఓకే అయింది… పెళ్లే తరువాయి అనుకున్నారు అంతా. కానీ ఇదంతా రూమర్ అని కొట్టి పాడేశారు అనుష్క, ప్రభాస్‌లు. మేమిద్దరం మంచి స్నేహితులమని స్పష్టం చేశారు. ఈ మధ్య ఓ సీనియర్ హీరోతో పెళ్లి అని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ప్రొడ్యూసర్‌తో మ్యారేజ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్నట్లే… స్వీటి కూడా ఓ ప్రొడ్యూసర్‌తో మ్యారేజ్‌కు ఫిక్స్ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇంతకీ ఎవరా నిర్మాత అని ఆరా తీస్తే… దిల్ రాజు అని సమాచారం. ఈ న్యూస్ ఎంత వరకి నిజమో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed