దిల్ బెచారా టైటిల్ ట్రాక్..సింగిల్ టేక్

by Jakkula Samataha |   ( Updated:2024-06-01 15:04:22.0  )
దిల్ బెచారా టైటిల్ ట్రాక్..సింగిల్ టేక్
X

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి చిత్రం దిల్ బెచారా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ మూవీస్‌ను కూడా వెనక్కి నెట్టి బెస్ట్ వ్యూయర్ షిప్, లైక్స్ సంపాదించిన దిల్ బెచారా నుంచి తాజాగా టైటిల్ సింగ్ రిలీజ్ అయింది.

సుశాంత్ మ్యాజిక్, ఏ ఆర్ రహమాన్ మ్యూజిక్, ఫరా ఖాన్ కొరియో గ్రఫీ.. అన్నీ కలిపి సూపర్ ఔట్ పుట్ వచ్చింది. సింగిల్ టేక్‌లో సాంగ్ షూట్ చేయగా.. కేవలం సుశాంత్ వల్ల మాత్రమే ఇది సాధ్యం కాగలదు అని .. నిజంగా సుశాంత్ సూపర్ స్టార్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈరోజుల్లో ఎంత మంది నటులు సింగిల్ టేక్‌లో సాంగ్ చేయగలరు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని చెప్తుంది కొరియో‌గ్రాఫర్ ఫరా ఖాన్. సుశాంత్‌తో పని చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అని తెలిపారు. నిజానికి సుశాంత్ తనకు మంచి స్నేహితుడు అని.. కానీ, అంతకు ముందు ఎప్పుడూ కలిసి పనిచేయలేదని తెలిపారు. డైరెక్టర్ ముఖేష్ చొబ్రా‌కు కూడా తన ఫస్ట్ సినిమాకు కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేస్తానని మాటిచ్చాను అని తెలిపింది. దిల్ బెచారా టైటిల్ ట్రాక్ కోసం వన్ డే రిహార్సల్ చేయగా హాఫ్ డే లో షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పారు ఫరా. సాంగ్ సూపర్‌గా వచ్చినందుకు సుశాంత్ తన నుంచి కోరుకున్న ట్రీట్ ఇంటి ఫుడ్ అని.. తను ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడని తెలిపింది. తనను ఈ జర్నీలో భాగస్వామ్యం చేసినందుకు డైరెక్టర్‌కు థాంక్స్ చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed